ఈ వారం కూడా బంగారం, వెండి ధరలు పైపైకి..!
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:59 AM
అమెరికా సుప్రీంకోర్టులో వాణిజ్య సుంకాలపై విచారణతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఈ వారం కూడా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: అమెరికా సుప్రీంకోర్టులో వాణిజ్య సుంకాలపై విచారణతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఈ వారం కూడా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కూడా దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా దిగుమతి సుంకాలు, ఆర్థిక విధానాలపై ప్రకటనలు కీలకంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో బులియన్ ధరలు సాఽనుకూల ధోరణిని కొనసాగించే అవకాశముందని అయితే మధ్యలో వచ్చే కరెక్షన్ కొనుగోలు అవకాశాలుగా మారవచ్చని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు.