ఎఫ్‌పీఐల పెట్టుబడులకు బ్రేక్
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:21 AM
భారత ఈక్విటీ మార్కెట్లో వరుసగా రెండు నెలల పాటు పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్లో వరుసగా రెండు నెలల పాటు పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికాలో అధిక వడ్డీ రేట్లు, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో సెప్టెంబరులో ఎఫ్‌పీఐలు రూ.35,860 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకు ముందు జూలై నెల లో రూ.20,200 కోట్లు, ఆగస్టు నెలలో రూ.29,630 కోట్ల పెట్టుబడులు పెట్టారు.