Share News

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:18 AM

గత ఆర్థిక సంవత్సరం (2025-26).. కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)..

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత

హెచ్‌యూఎల్‌, డాబర్‌ కంపెనీల్లో 1,273 మంది ఔట్‌

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26).. కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌).. 700 మంది పర్మినెంట్‌ ఉద్యోగులను ఇంటికి పంపించింది. డాబర్‌ కంపెనీ కూడా 573 మంది ఉద్యోగులపై వేటు వేసింది. హెచ్‌యూఎల్‌ జీతాల పెంపు విషయంలోనూ గత ఆర్థిక సంవత్సరం పొదుపు పాటించింది. మధ్యస్త ఉద్యోగుల సగటు జీతాలను ఈ కంపెనీ 6.08 శాతం మాత్రమే పెంచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.31 శాతం తక్కువ. అయితే మేనేజర్లు మినహా ఇతర ఉద్యోగుల సగటు జీతాలను మాత్రం హెచ్‌యూఎల్‌ 6.85 శాతం పెంచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.23 శాతం ఎక్కువ. మధ్యస్త ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో హెచ్‌యూఎల్‌తో పోలిస్తే డాబర్‌ ఇండియా కొద్దిగా మెరుగ్గా ఉంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం వారి జీతాలను సగటున 7.7 శాతం వరకు పెంచింది. ఇదే సమయంలో నెస్లే ఇండియా, మారికో, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. వారి జీతాలనూ బాగానే పెంచాయి.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 04:18 AM