ఈక్విటీ ఫండ్లలోకి రూ.38,306 కోట్లు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:16 AM
సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నికరంగా రూ.38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అంతక్రితం నెలలో నమోదైన రూ.29,329 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లతో పోలిస్తే 31 శాతం అధికమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం వెల్లడించింది.
ఈక్విటీ ఫండ్లలోకి రూ.38,306 కోట్లు
న్యూఢిల్లీ: ఈ సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నికరంగా రూ.38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అంతక్రితం నెలలో నమోదైన రూ.29,329 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లతోపోలిస్తే 31 శాతం అధికమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం వెల్లడించింది. ఈ ఏప్రిల్ (రూ.38,440 కోట్లు) తర్వాత ఇవే అత్యధిక పెట్టుబడులు కూడా. మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతుండటంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న తరుణంలోనూ మదుపరులు స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించడం ఇందుకు దోహదపడింది. సెప్టెంబరులో క్రమానుగత పెట్టుబడి పథకాల్లోకి(సిప్) నికర పెట్టుబడులు సరికొత్త జీవనకాల రికార్డు గరిష్ఠ స్థాయి రూ.32,490 కోట్లకు పెరిగాయని యాంఫీ తెలిపింది.