రోజుకు రూ.8,313 కోట్లు
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:53 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 31,950 కోట్ల డాలర్ల (రూ.30.35 లక్షల కోట్లు) మేర పుంజుకుంది....
గడిచిన ఏడాది కాలంలో మస్క్ సగటు సంపద వృద్ధి ఇది
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 31,950 కోట్ల డాలర్ల (రూ.30.35 లక్షల కోట్లు) మేర పుంజుకుంది. 2025 జూలైలో 40,560 కోట్ల డాలర్ల స్థాయిలో నమోదైన మస్క్ మొత్తం ఆస్తి విలువ.. ఈ జూలైలో 72,510 కోట్ల డాలర్లకు ఎగబాకింది. అంటే, ఈ ఏడాది కాలంలో ఆయన సంపద సగటున రోజుకు 87.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,313 కోట్లు) పెరుగుతూ వచ్చింది. అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (గతంలో ట్విటర్), అంతరిక్ష రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అధిపతి మస్క్. ఈ జూన్ 12న స్పేస్‌ఎక్స్ షేర్ల లిస్టింగ్‌తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్ష కోట్ల డాలర్లు దాటేసింది. దాంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవరించారు. అయితే, స్పేస్‌ఎక్స్ షేర్ల ధరలో తీవ్ర ఒడుదుడుకులకు అనుగుణంగా మస్క్ నెట్‌వర్త్ కూడా గడిచిన కొన్ని రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గత వారాంతం నాటికి 81,700 కోట్ల డాలర్లుగా నమోదైంది.