Share News

‘వేదాంత’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:01 AM

మైనింగ్‌ దిగ్గజం వేదాంత గ్రూప్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం...

‘వేదాంత’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంత గ్రూప్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణలకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. ఈ సోదాల్లో ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు వేదాంత గ్రూప్‌ ప్రకటించింది. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేస్తామని పేర్కొంది. గ్రూప్‌నకు ఉన్న 530 కోట్ల డాలర్ల అప్పులు చెల్లించేందుకు అక్రమంగా రాయల్టీ, డివిడెండ్‌ చెల్లింపులను ఉపయోగించారనే ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 03 , 2026 | 01:01 AM