రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:03 AM
గోరంత ఆదాయాన్ని కొండంతగా చూపిన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన...
న్యూఢిల్లీ: గోరంత ఆదాయాన్ని కొండంతగా చూపిన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తాజా గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కంపెనీకి చెందిన బెంగళూరు, ముంబై ఆఫీసుల్లో సోదాలు జరిపారు. తన విదేశీ అనుబంధ సంస్థల ఆదాయాన్ని కొండంత చేసి, గత ఐదేళ్లలో రూ.15.5 లక్షల కోట్లుగా చూపి అందరినీ బురిడీ కొట్టించిందని సెబీ ఇప్పటికే తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగడం విశేషం.
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!