Share News

ఐదేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయ లక్ష్యం

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:08 AM

విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) వచ్చే ఐదేళ్ల కాలంలో ఆదాయాలు రెట్టింపు...

ఐదేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయ లక్ష్యం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌

న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) వచ్చే ఐదేళ్ల కాలంలో ఆదాయాలు రెట్టింపు చేసుకోవడంపై దృష్టి సారించింది. 2014-15లో రూ.550 కోట్లున్న ఆదాయం 2024-25 నాటికి రూ.1,148 కోట్లకు చేరిందని, మరో ఐదారేళ్లలో దీన్ని రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌ దివాకర్‌ చెప్పారు. ఈ నెల 29వ తేదీన సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం తాము కొత్త మార్కెట్లు, నూతనంగా ప్రవేశించే అవకాశం ఉన్న రంగాల కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా రిజర్వాయర్లు, డ్యాములకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 06:08 AM