Share News

డిజిలాజిక్‌ ఆదాయం రుపాయలు .35 కోట్లు

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:12 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ, ఏరోస్పేస్‌ రంగానికి చెందిన డిజిలాజిక్‌ సిస్టమ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్థానికి గాను రుపాయలు.34.96 కోట్ల మొత్తం ఆదాయంపై రఙూ.4.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

డిజిలాజిక్‌ ఆదాయం రుపాయలు .35 కోట్లు
digilogic

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ, ఏరోస్పేస్‌ రంగానికి చెందిన డిజిలాజిక్‌ సిస్టమ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్థానికి గాను రుపాయలు.34.96 కోట్ల మొత్తం ఆదాయంపై రఙూ.4.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 150.53 శాతం వృద్ధి చెందగా ఆదాయం 91.25 శాతం పెరిగింది. ఈ నెల 26 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రుపాయలు.20 కోట్లుగా ఉండగా మరో 54 కోట్ల విలువైన ఆర్డర్లు తుది దశలో ఉన్నట్లు వెల్లడించింది. అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు ఉన్నాయని, కంపెనీ ఆర్‌ అండ్‌ డీని మరింత పటిష్ఠం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డిజిలాజిక్‌ సీఈఓ శశాంక్‌ వర్మ జెట్టీ వివరించారు. కాగా కంపెనీ అనుబంధ సంస్థ అభేద్య సిస్టమ్స్‌ 2028-29 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం నాటికి అందుబాటులోకి రానుందని తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 06:38 AM