Share News

సైయెంట్‌ చేతికి టావో డిజిటల్‌

ABN , Publish Date - May 31 , 2026 | 04:22 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ లిమిటెడ్‌.. వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన టావో డిజిటల్‌ సొల్యూషన్స్‌ ఇంక్‌ను పూర్తిగా...

సైయెంట్‌ చేతికి టావో డిజిటల్‌

  • డీల్‌ విలువ రూ.2,071 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ లిమిటెడ్‌.. వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన టావో డిజిటల్‌ సొల్యూషన్స్‌ ఇంక్‌ను పూర్తిగా కొనుగోలు చేయనుంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా ఏఐ-నేటివ్‌ డేటా, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్లు అందిస్తున్న టావోను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు సైయెంట్‌ శనివారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 21.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,071 కోట్లు). ఈ కొనుగోలు ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సైయెంట్‌ తెలిపింది. 2022లో ఏర్పాటైన టావో డిజిటల్‌.. అమెరికా, కెనడా, భారత్‌, తైవాన్‌, యూరప్‌ దేశాల్లో విస్తరించి ఉంది. ఆటోమోటివ్‌, హై-టెక్‌, హెల్త్‌టెక్‌ తదితర రంగాల్లోని గ్లోబల్‌ కంపెనీల సంక్లిష్ట వ్యాపార, సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలు ఈ కంపెనీ అందిస్తోంది. డేటా ఇంజనీరింగ్‌, ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ సొల్యూషన్స్‌, డిజిటలైజేషన్‌, క్లౌడ్‌ సర్వీసె్‌సలో ఈ కంపెనీకి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 3,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - May 31 , 2026 | 04:22 AM