Share News

చమురు ధరలపై మరింత అనిశ్చితి

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:13 AM

ముడి చమురు ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగిసే వరకు ఈ పరిస్థితి తప్పదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

చమురు ధరలపై మరింత అనిశ్చితి

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగిసే వరకు ఈ పరిస్థితి తప్పదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై సౌదీ అరేబియా నాయకత్వంలో జరుగుతున్న దాడు ల్లో తాము కూడా పాల్గొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అదే జరిగితే చమురు ధర మరింత భగ్గుమనే ప్రమాదం కనిపిస్తోంది. ‘ట్రంప్‌ ప్రకటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి చమురు సరఫరాకు ఆటంకాలు మరింత పెరుగుతాయి’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కమోడిటీస్‌ విభాగం రీసెర్చ్‌ హెడ్‌ నవనీత్‌ దమానీ చెప్పారు. మరోవైపు ఫ్యూచర్స్‌ మార్కెట్లో డిసెంబరులో డెలివరీ ఇచ్చే బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర ఇప్పటికే 2.41 శాతం 104.72 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడి, చమురు సరఫరాలు సాధారణ స్థితికి చేరే వరకు చమురు మార్కెట్లో ఈ ఆటుపోట్లు తప్పవని మార్కెట్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి.

Updated Date - Oct 12 , 2026 | 05:14 AM