Share News

ఎరువుల ప్లాంట్లకు సమీపంలో సిన్‌ గ్యాస్‌ ప్రాజెక్టులు

ABN , Publish Date - May 25 , 2026 | 04:43 AM

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగంలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) కీలక నిర్ణయం...

ఎరువుల ప్లాంట్లకు సమీపంలో సిన్‌ గ్యాస్‌ ప్రాజెక్టులు

కోల్‌ ఇండియా సన్నాహాలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగంలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు నుంచి సిన్‌గ్యా్‌సను ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ యూనిట్లను గనుల పరిసర ప్రాంతాల్లో లేదా గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు, ఎరువుల తయారీ యూనిట్లు వంటి భారీ పరిశ్రమలకు సమీపంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దేశంలో బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వాటా ఉన్న కోల్‌ ఇండియా.. బొగ్గు నుంచి సిన్‌ గ్యా్‌సను ఉత్పత్తి చేసే యూనిట్లను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే చర్యలను ప్రారంభించింది. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్‌ మిషన్‌, దేశీయ రసాయన, ఫీడ్‌ స్టాక్‌ భద్రతను పెంపొందించాలనే ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కంపెనీ పని చేస్తోంది. ఇందులో భాగంగా బొగ్గు నుంచి సిన్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను బిల్డ్‌-ఓన్‌-ఆపరేట్‌ (బీఓఓ) లేదా బిల్డ్‌-ఆపరేట్‌-మెయింటైన్‌ (బీఓఎం) ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. సిన్‌ గ్యాస్‌ను స్వచ్ఛమైన ఇంధనాలు, ఎరువులు, రసాయనాల ఉత్పత్తి, విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 25 , 2026 | 04:43 AM