Share News

ఛత్తీస్‌గఢ్ లో వజ్రాల నిక్షేపాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:18 AM

దేశంలోని మరో రాష్ట్రంలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. ఛత్తీస్‌గఢ్ లోని మహాసముంద్‌ జిల్లాలోని సరాయ్‌పాలి ప్రాంతంలోని...

ఛత్తీస్‌గఢ్ లో వజ్రాల నిక్షేపాలు

రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్): దేశంలోని మరో రాష్ట్రంలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. ఛత్తీస్‌గఢ్ లోని మహాసముంద్‌ జిల్లాలోని సరాయ్‌పాలి ప్రాంతంలోని బలోడ-బేల్‌ముండి డైమండ్‌ బ్లాక్‌లో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎండీసీ, ఛత్తీ్‌సగఢ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ సంయుక్తంగా జరిపిన అన్వేషణలో ఈ నిక్షేపాల ఆచూకీ దొరికింది. ఈ బ్లాకులో 500 మీటర్ల తవ్వకం తర్వాత తీసిన 200 టన్నుల మట్టిని జల్లెడ పట్టగా 1.22 కేరట్ల బరువున్న ఐదు ముడి వజ్రాలు దొరికాయి. దీనికి తోడు మహాసముంద్‌ జిల్లాకు ఆనుకుని ఉన్న గరియాబంద్‌ జిల్లాలోని మెయిన్‌పూర్‌ ప్రాంతంలోనూ వజ్ర నిక్షేపాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇనుప ఖనిజం, బొగ్గు, బాక్సైట్‌, సున్నపురాయి నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌ త్వరలో వజ్రాల వెలికితీతకూ కేంద్రం కానుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:18 AM