Share News

హైదరాబాద్‌లో చార్లెస్‌ ష్వాబ్‌ జీసీసీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:15 AM

హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటైంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసుల కంపెనీ...

హైదరాబాద్‌లో చార్లెస్‌ ష్వాబ్‌ జీసీసీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటైంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసుల కంపెనీ చార్లెస్‌ ష్వాబ్‌ తన టెక్నాలజీ కేపబిలిటీ సెంటర్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. ఈ కేంద్రం 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెక్నాలజీ అభివృద్ధి, ఇంజనీరింగ్‌ నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాల ద్వారా చార్లెస్‌ ష్వాబ్‌ అమెరికా వ్యాపారానికి ష్వాబ్‌ ఇండియా మద్దతుగా నిలువనుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో దాదాపు 200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 500కు చేరనున్నట్టు ష్వాబ్‌ ఇండియా కంట్రీ హెడ్‌, ఎండీ ప్రదీప్‌ మీనన్‌ తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి ఉద్యోగుల సంఖ్యను దాదాపు 2,000కు పెంచుకోనున్నట్లు చెప్పారు.

Updated Date - Aug 20 , 2026 | 05:15 AM