ఎలక్ట్రానిక్ పరిశ్రమకు ఊరట
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:19 AM
దేశీయ ఎలకా్ట్రనిక్ పరికరాల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ పరిశ్రమకు అవసరమైన డిస్‌ప్లే అసెంబ్లీ, లిథియం అయాన్ సెల్స్...
కీలక విడిభాగాలపై కస్టమ్స్ సుంకం ఎత్తివేత
న్యూఢిల్లీ: దేశీయ ఎలకా్ట్రనిక్ పరికరాల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ పరిశ్రమకు అవసరమైన డిస్‌ప్లే అసెంబ్లీ, లిథియం అయాన్ సెల్స్, ఇండక్టర్ కాయిల్స్ మాడ్యూల్స్‌లో ఉపయోగించే కీలక విడిభాగాలపై విధించే కనీస కస్టమ్స్ సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. ఈ డిస్‌ప్లే అసెంబ్లీలను స్ట్మార్ట్ ఫోన్లు, లాప్‌ట్యాప్స్, వేరబుల్, స్మార్ట్ టీవీల్లో ఉపయోగిస్తారు. దేశీయంగా ఎలకా్ట్రనిక్ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 2029 మార్చి వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..