సిమెంట్ కంపెనీల లాభాలకు గండి
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:13 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1).. దేశంలోని లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో ఒక్క అంబుజా సిమెంట్ కంపెనీ మినహా...
క్యూ1లో దెబ్బతీసిన ఇంధన, ముడి
పదార్థాల ఖర్చులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1).. దేశంలోని లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో ఒక్క అంబుజా సిమెంట్ కంపెనీ మినహా మిగతా సిమెంట్ కంపెనీలన్నీ రెండు అంకెల్లో అమ్మకాల వృద్ధి రేటు నమోదు చేశాయి. అయితే ఇంధన ధరలు, ఉత్పత్తి వ్యయాలు, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో క్యూ1లో ఈ కంపెనీల లాభాల మార్జిన్లకు గండి పడింది. కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ఽగత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ధరలు రెండు శాతం తగ్గడం ఇందుకు మరింత దోహదం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో అమ్మకాలు పెరిగినా అల్ర్టాటెక్, నువోకో విస్తాస్ కంపెనీలు మాత్రమే లాభాలు పెంచుకున్నాయి. అంబుజా సిమెంట్స్, శ్రీసిమెంట్, దాల్మియా భారత్, జేకే లక్ష్మి సిమెంట్, బిర్లా కార్పొరేషన్ వంటి మిగతా లిస్టెడ్ సిమెంట్ కంపెనీల లాభాలకు మాత్రం గండి పడింది. ‘క్యూ1లో సిమెంట్ డిమాండ్ స్థిరంగానే ఉంది. మౌలిక, గృహ నిర్మాణ ప్రాజెక్టులు,, నిర్మాణ రంగం ఇందుకు బాగా దోహదం చేశాయి. అయితే ఇంధన ధరలు, రవాణ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు, పశ్చిమాసియా సంక్షోభం కంపెనీల లాభాలను దెబ్బతీశాయి’ అని అంబుజా సిమెంట్స్ సీఈఓ వినోద్ బహేతి చెప్పారు.