హైదరాబాద్‌లో క్యాండెసెంట్ కొత్త సెంటర్
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:19 AM
అమెరికా కేంద్రంగా ఉన్న బ్యాంకింగ్ టెక్నాలజీ దిగ్గజం క్యాండెసెంట్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికా కేంద్రంగా ఉన్న బ్యాంకింగ్ టెక్నాలజీ దిగ్గజం క్యాండెసెంట్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో 260 మంది పనిచేసేలా కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఇది రెండో టెక్నాలజీ కేంద్రం. భారత్‌లో వ్యాపార కార్యకలాపాల విస్తరణ తమకు వ్యూహాత్మక చర్య అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) జాన్ గార్వీ, కంపెనీ ఇండియా జీఎం రాఘవ్ పావమాన్ చెప్పారు. ప్రస్తుతం తమ ఏఐ ఆధారిత సేవలు అన్నిటిని భారత్ నుంచే నిర్వహిస్తున్నట్టు రాఘవ్ తెలిపారు. బెంగళూరు, ముంబైల్లోని క్యాండెసెంట్ సెంటర్లలో ఇప్పటికే 1,000 మందికి పైగా పని చేస్తున్నారు. కాగా గత ఏడాది 400కి పైగా ఉద్యోగులను నియమించుకున్నామని, రానున్న రోజుల్లో మరో 1,000 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు రాఘవ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..