కెనరాబ్యాంక్ రూ.5,000 కోట్ల సమీకరణ
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:25 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ టయర్ 2 బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ టయర్ 2 బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ ఇష్యూ గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలోని ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫారంపై ప్రారంభమవుతుందని తెలిపింది. బేస్ ఇష్యూ పరిమాణం రూ.2,000 కోట్లు కాగా రూ.3,000 కోట్లు అదనంగా సమీకరించే స్వేచ్ఛ బ్యాంకు తన చేతిలో ఉంచుకుంది.