Share News

ఏపీలో క్రెడిట్‌ అవుట్‌రీచ్‌కు రూ.393 కోట్ల రుణాలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:32 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగిన క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కెనరా బ్యాంక్‌ రూ.393.17 కోట్లు మంజూరు చేసింది...

ఏపీలో క్రెడిట్‌ అవుట్‌రీచ్‌కు రూ.393 కోట్ల రుణాలు

అమరావతి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగిన క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కెనరా బ్యాంక్‌ రూ.393.17 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్వహించిన ఈ క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అలాగే ప్రాధాన్యతా రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బ్రజేశ్‌ కుమార్‌ సింగ్‌ రుణ మంజూరు పత్రాలను అందచేశారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్‌) కింద రూ.36.85 లక్షల నిధులను అందించినట్లు సింగ్‌ వెల్లడించారు. క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ ద్వారా రుణాలు మంజూరు చేయటమే కాకుండా సమగ్ర వృద్ధికి తోడ్పాటు అందించటమే తమ ప్రధాన లక్ష్యమని సింగ్‌ తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 05:32 AM