కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్ కుమార్ సింగ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:56 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ గా బ్రజేశ్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. 2029 ఏప్రిల్ 30 వరకు ఈయన...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ గా బ్రజేశ్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. 2029 ఏప్రిల్ 30 వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ బ్యాంకింగ్, బిజినెస్ డెవల్‌పమెంట్ విభాగాల్లో ఈయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్‌లో చేరే ముందు వరకు సింగ్.. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలహాబాద్ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ నుంచి వ్యవసాయంలో గ్రాడ్యుయేట్ పట్టాను అందుకున్న సింగ్.. ఫైనాన్స్‌లో ఎంబీఎ పూర్తి చేశారు. కాగా గత ఏడాది డిసెంబరు వరకు ఎండీగా వ్యవహరించిన కే సత్యనారాయణ రాజు పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో బ్రజేశ్ కుమార్ నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..