కేంద్ర బడ్జెట్ 2026.. దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్స్..
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:09 PM
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27లో విద్యకు పెద్ద పీట వేసింది. దేశంలో ప్రతీ జిల్లాలో బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
దేశంలో ప్రతి జిల్లాలో బాలికలకు వసతి గృహం: నిర్మల
యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులు: నిర్మల
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27లో విద్యకు పెద్ద పీట వేసింది. దేశంలో ప్రతీ జిల్లాలో బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులు తీసుకువస్తామని తెలిపారు. మూడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తామని వెల్లడించారు. సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.