Share News

బొండాడకు రూ.816 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - May 09 , 2026 | 04:54 AM

ఎన్‌టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ నుంచి రూ.816 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకున్నట్లు...

బొండాడకు రూ.816 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ నుంచి రూ.816 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకున్నట్లు బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. ఆర్డర్‌లో భాగంగా రాజస్థాన్‌, ఫతేఘర్‌లో 600 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఎన్‌టీపీసీ నుంచి కంపెనీ అందుకున్న రెండో ఆర్డర్‌ ఇదని తెలిపింది.

Updated Date - May 09 , 2026 | 04:54 AM