బిట్స్ పిలానీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:07 AM
దేశీయ డీప్‌టెక్, అధునాతన పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
రూ. 100 కోట్లతో హైదరాబాద్‌లో పరిశోధనా కేంద్రం
ముంబై: దేశీయ డీప్‌టెక్, అధునాతన పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, యాక్సిస్ బ్యాంక్ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో ఒక అత్యాధునిక ‘ఇండస్ట్రీ రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్క్’ను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.