హైసియా ప్రెసిడెంట్‌గా బిపిన్ పెండ్యాల
ABN , Publish Date - May 01 , 2026 | 04:41 AM
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య (హైసియా) నూతన అధ్యక్షుడుగా యాపెన్ ఇండియా జనరల్ మేనేజర్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య (హైసియా) నూతన అధ్యక్షుడుగా యాపెన్ ఇండియా జనరల్ మేనేజర్ బిపిన్ పెండ్యాల ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన హైసియా 34వ సర్వసభ్య సమావేశంలో 2026-28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అన్ని పరిశ్రమలకు కృత్రిమ మేధ పునాదిగా మారుతున్న దశలో హైసియా సారథిగా ఎన్నిక కావడం పట్ల పెండ్యాల హర్షం ప్రకటించారు.హైసియా జనరల్ సెక్రటరీగా ట్రెడెన్స్ ఇంక్ సీఓఓ జితేంద్ర పుచ్చా, కోశాధికారిగా ఇన్ఫోసిస్ గచ్చిబౌలి క్యాంపస్ వైస్ ప్రెసిడెంట్ రఘు బొడ్డుపల్లి ఎన్నికయ్యారు.