20 నిమిషాల్లో రూ.60,000 కోట్ల చోరీ!
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:25 AM
క్రిప్టో కరెన్సీ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద దొంగతనం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కేవలం..
బైనాన్స్ నుంచి 630 కోట్ల డాలర్ల క్రిప్టో ఆస్తులను కాజేసిన సైబర్ నేరగాళ్లు
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద దొంగతనం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కేవలం 20 నిమిషాల వ్యవధిలో 630 కోట్ల డాలర్ల (రూ.59,850 కోట్లు) విలువైన డిజిటల్ కరెన్సీ ఆస్తులను కాజేశారు. బైనాన్స్ శుక్రవారం ఈ విషయా న్ని అధికారికంగా ధ్రువీకరించింది. అమెరికాకు చెంది న బ్లాక్ చెయిన్ అనలిటిక్స్ సంస్థ టీఆర్‌ఎం ల్యాబ్స్ ప్రకారం.. సైబర్ నేరగాళ్లు బైనాన్స్‌లో క్రిప్టో లావాదేవీలను ప్రాసెస్ చేసే సైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను హ్యాక్ చేసి ఎక్స్ఛేంజ్‌కు చెందిన వ్యాలెట్లలోని క్రిప్టో కరెన్సీలను కొట్టేశారు. అందులో దాదాపు సగం స్టేబుల్ కాయిన్స్ అని తెలిసింది. ఉత్తర కొరియాకు చెందిన సైబర్ నేరగాళ్లే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఏర్పడిన నష్టాన్ని పూర్తిగా భరిస్తామని, తమ యూజర్ల ఫండ్స్ కు ఢోకా లేదని పేర్కొంది.