Share News

హైదరాబాద్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ యూనిట్‌!

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:08 AM

హైదరాబాద్‌ మరో భారీ కంపెనీకి కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు అవసరమైన ఆల్కలైన్‌ వాటర్‌ ఎలక్ట్రోలైజర్స్‌ సిస్టమ్స్‌ను దేశీయంగా...

హైదరాబాద్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ యూనిట్‌!

దశలవారీగా రూ.10,000 కోట్ల వరకు పెట్టుబడి

బీహెచ్‌ఈఎల్‌-థైసెన్‌క్రూ్‌ప న్యుసెరా ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ మరో భారీ కంపెనీకి కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు అవసరమైన ఆల్కలైన్‌ వాటర్‌ ఎలక్ట్రోలైజర్స్‌ సిస్టమ్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ థైసెన్‌క్రూ్‌ప న్యుసెరా అనుబంధ సంస్థ థైసెన్‌క్రూ్‌ప న్యుసెరా ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రభుత్వ రంగంలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లో జర్మనీ రాయబారి ఫిలిప్‌ అకెర్‌మన్‌ సమక్షంలో బీహెచ్‌ఈఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (హెవీ పవర్‌ ఎక్వి్‌పమెంట్‌ ప్లాంట్‌) వై శ్రీనివాస్‌ రావు, థైసెన్‌క్రూ్‌ప న్యుసెరా ఇండియా సీఈఓ కిరణ్‌ జోసెఫ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కాగా దశల వారీగా దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్లాంటు హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నీటి నుంచి గ్రీన్‌ హైడ్రోజన్‌ను వేరు చేయడంలో ఈ ఎలకో్ట్రలైజర్లు కీలక పాత్ర వహిస్తాయి. దేశంలోని గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు అవసరమైన ఎలకో్ట్రలైజర్ల ఉత్పత్తిని దశల వారీగా స్వదేశీకరించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ప్రధాన ఉద్దేశమని బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది.

జునో జోల్‌తోనూ థైసెన్‌క్రూ్‌ప జట్టు: థైసెన్‌క్రూప్‌ న్యుసెరా ఇండియా.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న జునో జోల్‌ గ్రీన్‌ ఎనర్జీతోనూ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద జునో జోల్‌.. దేశంలో అభివృద్ధి చేసే 260 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ డిజైన్‌ (ఎఫ్‌ఈఈడీ) స్టడీ సేవలను థైసెన్‌క్రూ్‌ప అందించనుంది. కాగా జునో జోల్‌ ఇప్పటికే సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వద్ద రోజుకు 100 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. రూ.700 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు తొలి దశ వచ్చే ఏడాది మే కల్లా ఉత్పత్తి ప్రారంభించనుంది.

ఇవి కూడా చదవండి..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 06:08 AM