ఎయిర్‌టెల్ లాభం రూ.8,167 కోట్లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:10 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం 37.3 శాతం పెరిగి రూ.8,167 కోట్లకు...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం 37.3 శాతం పెరిగి రూ.8,167 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.5,948 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రాబడి 18.3 శాతం పెరిగి రూ.49,462 కోట్ల నుంచి రూ.58,539 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఇండియాకు సంబంధించి ఒక్కో వినియోగదారు నుంచి సగటు రాబడి (ఆర్పూ) 5.6 శాతం పెరిగి రూ.264కు చేరుకుంది. జూన్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌పై ఒక్కో కస్టమర్ సగటు డేటా వినియోగం 27.7 శాతం పెరిగి 34.4 జీబీలకు చేరుకుంది.