Share News

బెంట్లీ తొలి ఈవీ టోర్కల్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:14 AM

బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ బెంట్లీ మోటార్స్‌.. తన తొలి పూర్తి స్థాయి ఎలక్ర్టిక్‌ కారు ‘టోర్కల్‌’ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

బెంట్లీ తొలి ఈవీ టోర్కల్‌

  • వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ బెంట్లీ మోటార్స్‌.. తన తొలి పూర్తి స్థాయి ఎలక్ర్టిక్‌ కారు ‘టోర్కల్‌’ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. 2027 ద్వితీయార్ధంలో దీన్ని విడుదల చేయనున్నట్టు కంపెనీ సీఈఓ, చైర్మన్‌ ఫ్రాంక్‌ స్టీఫెన్‌ వాలిసర్‌ పేర్కొన్నారు. భారత్‌ తమకు అత్యధిక వృద్ధి అవకాశాలున్న మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. భారత్‌-యూకే దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరింత స్పష్టతను, వృద్ధి అవకాశాలను అందిస్తుందన్నారు. ఇక భారత్‌లో బెంట్లీ కార్ల తయారీ లేదా అసెంబ్లింగ్‌ను చేపట్టే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సుంకాల నిర్మాణంతో సంబంధం లేకుండా అన్ని కార్లను బ్రిటన్‌లోని బెంట్లీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచే దిగుమతి చేసుకుంటామని తెలిపారు. బెంట్లీ కార్ల తయారీలో సంక్లిష్టమైన ఇంజనీరింగ్‌, ప్రత్యేక నైపుణ్యాలు, హస్తకళా నైపుణ్యం అవసరమని, దీనివల్ల స్థానిక తయారీ వాణిజ్యపరంగా లాభదాయకం కాదన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 04:15 AM