Share News

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:07 AM

ఖాతాల్లో కనీస నిల్వ లేని కారణంగా కస్టమర్లపై వడ్డింపుల ద్వారా బ్యాంక్‌లకు గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో మొత్తం రూ.7,087 కోట్ల ఆదాయం సమకూరింది....

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

న్యూఢిల్లీ: ఖాతాల్లో కనీస నిల్వ లేని కారణంగా కస్టమర్లపై వడ్డింపుల ద్వారా బ్యాంక్‌లకు గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో మొత్తం రూ.7,087 కోట్ల ఆదాయం సమకూరింది. అందులో ప్రైవేట్‌ బ్యాంక్‌ల వసూళ్లు రూ.4,948.71 కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వసూళ్లు రూ.2,137.92 కోట్లు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఈ విషయంపై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2025-26లో సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్లలో కనీస సగటు నిల్వ లేని కారణంగా రుసుము వసూళ్ల ద్వారా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌కు అత్యధికంగా రూ.1,798.14 కోట్లు సమకూరగా.. యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.1,081.33 కోట్ల ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 29 , 2026 | 03:07 AM