బీఓబీ లాభం రూ.6,737 కోట్లు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:42 AM
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.6,532 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.6,532 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాం క్ చరిత్రలో ఒక త్రైమాసికంలో సాధించిన అత్యధిక నికర లాభం ఇదే. సమీక్షా త్రైమాసికంలో దేశీయ డిపాజిట్లు 16.6 శాతం పెరిగి రూ. 14.83 లక్షల కోట్లకు, గ్లోబల్ డిపాజిట్లు 16.4 శాతం పెరిగి రూ.17.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి.