Share News

బ్యాంకుల విలీనానికి కృషి చేయాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:24 AM

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో మార్కెట్‌ పోటీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా సమాన ఆస్తుల పరిమాణం ఉన్న కొన్ని పెద్ద బ్యాంకులను సృష్టించేలా బ్యాంకుల విలీన ప్రక్రియను భారత్‌ చేపట్టాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక వర్కింగ్‌ పేపర్‌లో సూచించింది.

బ్యాంకుల విలీనానికి కృషి చేయాలి

పెద్ద బ్యాంకులు ఏర్పడేలా విలీన ప్రక్రియ ఉండాలి: ఈఏసీ-పీఎం సూచన

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో మార్కెట్‌ పోటీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా సమాన ఆస్తుల పరిమాణం ఉన్న కొన్ని పెద్ద బ్యాంకులను సృష్టించేలా బ్యాంకుల విలీన ప్రక్రియను భారత్‌ చేపట్టాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక వర్కింగ్‌ పేపర్‌లో సూచించింది. 2047నాటికి వికసిత్‌ భారత్‌గా ఎదగాలన్న దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ‘‘గత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు, సామర్థ్యం, ఉత్పాదకత: ఒక డీఈఏ విధానం’’ శీర్షికన ఈ పేపర్‌ను రూపొందించారు. బ్యాంకుల మార్కెట్‌ వాటాలో చాలా తేడా ఉందని, కొన్నింటి మార్కెట్‌ వాటా 20 శాతం, మరి కొన్నింటి ఒక శాతానికన్నా తక్కువగా ఉందని ఈఏసీ-పీఎం పేర్కొంది. ఈ దృష్ట్యా మార్కెట్‌ పోటీకి భంగం కలగకుండా సమాన పరిమాణం కలిగిన కొన్ని పెద్ద బ్యాంకులను సృష్టించేలా బ్యాంకుల విలీనానికి కృషి చేయాలని తెలిపింది. 2017 సంవత్సరంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ బ్యాంకుల విలీనం, 2019లో విజయాబ్యాంకు-దేనా బ్యాంకు విలీనం, 2020లో 10 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేయడం వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గిందని పేర్కొంది.

Updated Date - Aug 27 , 2026 | 06:24 AM