Share News

మిత్సుబిషికి గ్యాస్‌ టర్బైన్‌ నాజిల్‌ వేన్స్‌: ఆజాద్‌ ఇంజనీరింగ్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:39 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆజాద్‌ ఇంజనీరింగ్‌.. జపాన్‌ పారిశ్రామిక దిగ్గజం మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ (ఎంహెచ్‌ఐ)తో తన భాగస్వామ్యాన్ని మరింత...

మిత్సుబిషికి గ్యాస్‌ టర్బైన్‌ నాజిల్‌ వేన్స్‌: ఆజాద్‌ ఇంజనీరింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆజాద్‌ ఇంజనీరింగ్‌.. జపాన్‌ పారిశ్రామిక దిగ్గజం మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ (ఎంహెచ్‌ఐ)తో తన భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇందులో భాగంగా మిత్సుబిషి గ్యాస్‌ టర్బైన్లకు అవసరమైన నాజిల్‌ వేన్స్‌ (గాలి దిక్కును సూచించే ఒక కీలక పరికరం) కూడా సరఫరా చేయనుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల పాటు అమలులో ఉండేలా రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆజాద్‌ ఇంజనీరింగ్‌ ఇప్పటికే ఎంహెచ్‌ఐకి అనేక కీలక పరికరాలు సరఫరా చేస్తోంది. ఇప్పుడు అత్యంత క్లిష్టమైన గ్యాస్‌ టర్బైన్‌ నాజిల్‌ వేన్స్‌ను కూడా సరఫరా చేయబోతున్నట్టు ఆజాద్‌ ఇంజనీరింగ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 27 , 2026 | 01:39 AM