Share News

దేశీయంగా ఎలక్ర్టిక్‌ కారు తయారీ: ఆడి

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:25 AM

దేశీయంగా బ్యాటరీ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ (బీఈవీ)ను తయారు చేయనున్నట్లు ఆడి ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు.

దేశీయంగా ఎలక్ర్టిక్‌ కారు తయారీ: ఆడి

పనాజీ: దేశీయంగా బ్యాటరీ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ (బీఈవీ)ను తయారు చేయనున్నట్లు ఆడి ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. దీనిపై రాబోయే రెండు నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వచ్చే మూడేళ్లలో లగ్జరీ కార్ల విభాగంలో మార్కెట్‌ వాటాను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇందుకోసం వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలనే వ్యూహంతో ఉన్నామని తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 05:26 AM