Share News

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 38 శాతం వృద్ధి

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:15 AM

అపోలో హాస్పిటల్స్‌.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.610.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో...

అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 38 శాతం వృద్ధి

క్యూ1లో రూ.610 కోట్లుగా నమోదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో హాస్పిటల్స్‌.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.610.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 38.4 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ.5,842.10 కోట్ల నుంచి రూ.7,043.50 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో హెల్త్‌కేర్‌ సర్వీసుల ఆదాయం రూ.2,973.80 కోట్ల నుంచి రూ.3,619.50 కోట్లకు పెరగగా డిజిటల్‌ హెల్త్‌, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్‌ ఆదాయం రూ.2,471.90 కోట్ల నుంచి రూ.2,977 కోట్లకు పెరిగింది. డయాగ్నోస్టిక్స్‌ విభాగం రెవెన్యూలు రూ.499.50 కోట్లుగా ఉన్నాయి.

కాగా గురుగ్రామ్‌లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇండోర్‌, ద్వారక, ఢిల్లీ ప్రోటాన్‌ సెంటర్‌, రాంచీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్స్‌తో పాటు ఇండోర్‌, గువాహతిల్లోని ప్రస్తుత హాస్పిటల్స్‌ విస్తరణను చేపడుతున్నట్లు తెలిపింది. వీటితో పాటు వచ్చే ఐదేళ్లలో అదనంగా 5,800 పడకలను చేర్చుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించింది.

Updated Date - Aug 13 , 2026 | 05:15 AM