Share News

ఫెమా కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఊరట

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:02 AM

అపోలో హాస్పిటల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ...

ఫెమా కేసులో అపోలో హాస్పిటల్స్‌కు ఊరట

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): అపోలో హాస్పిటల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల కేసు.. రూ.17.76 కోట్ల కాంపౌండింగ్‌ ఫీజు చెల్లింపుతో ముగిసింది. దీంతో పాటు ఆర్‌బీఐ ఆదేశాల మేరకు అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లు ఐదుగురు ఒక్కొక్కరు రూ.18 లక్షల చొప్పున చెల్లించారు. దాంతో అపోలో హాస్పిటల్‌పై ఫెమా ఉల్లంఘనల కేసును క్లోజ్‌ చేసినట్లు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jun 18 , 2026 | 05:03 AM