అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు జీఎస్‌టీ చెల్లించాలా?
ABN , Publish Date - May 03 , 2026 | 03:50 AM
ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు జీఎస్‌టీకి సంబంధించి ఆందోళన చెందటం చూస్తున్నాం. ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్స్....
ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు జీఎస్‌టీకి సంబంధించి ఆందోళన చెందటం చూస్తున్నాం. ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్స్ తాము జీఎస్‌టీ చెల్లించాల్సి రావటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు వెల్ఫేర్ అసోసియేషన్ జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉందా? ఆ వివరాలు మీ కోసం..
ఒకప్పుడు అపార్ట్‌మెంట్ అంటే నాలుగైదు అంతస్తులకు మాత్రమే పరిమితమై ఉండేవి. వీటిలో కనీస అవసరాలు మాత్రమే ఉండేవి. క్రమేపి ప్రజల జీవనశైలి మారటం, అభిరుచుల్లో మార్పులతో పాటుగా బ్యాంకింగ్ సేవలు అందరికి అందుబాటులోకి రావటంతో వివిధ సదుపాయాలతో ఉండే బహుళ అంతస్తులు ఉండే భవనాలు వెలుస్తున్నాయి. బిల్డర్ తాను అపార్ట్‌మెంట్ నిర్మించే సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించినా ఆ తర్వాత వాటిని మెయింటెనెన్స్ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అపార్ట్‌మెంట్‌లో నివసించే వారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా సొసైటీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ అసోసియేషన్ చేసే పని ఏమిటంటే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని పనులు అంటే సెక్యూరిటీ, లిఫ్ట్, కామన్ ఏరియా, పార్కులు, ఆట స్థలాలు మొదలైన వాటిని చూసుకుంటుంది. దీనిలో అపార్ట్‌మెంట్‌లోని అందరు సభ్యులుగా వ్యవహరిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం ప్రతి సభ్యుడి నుంచి కొంత మెయింటెనెన్స్ చార్జీల కింద వసూలు చేస్తారు. మరి ఇలా వసూలు చేసే చార్జీల మీద ఆయా సంక్షేమ సంఘాలు జీఎస్‌టీ చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే దాని విధి విధానాలు ఏమిటి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
వస్తుంది కాబట్టి ఐటీసీ కూడా 60 శాతమే తీసుకోవాలి.
మినహాయింపులున్నాయ్..: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జీఎస్‌టీ చెల్లించాలా అంటే.. కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇది కొత్తగా విధించిన పన్ను కాదు.. జీఎస్‌టీ వచ్చినప్పటి నుంచి ఉంది. ఇంకా చెప్పాలంటే సర్వీస్ ట్యాక్స్ కాలం నుంచి ఉంది. మరి ఇది అందరూ చెల్లించాలా అంటే, దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తమ సభ్యుల ద్వారా వసూలు చేసే మొత్తం సంవత్సరానికి రూ.20 లక్షలు దాటనంత వరకు ఆయా సంక్షేమ సంఘాలకు జీఎస్‌టీ కింద రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ ఆ మొత్తం రూ.20 లక్షలు దాటితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇంకా సభ్యుడి నుంచి వసూలు చేసే నెలవారీ మెయింటెనెన్స్ నెలకు రూ.7,500 మించకపోతే ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక అపార్ట్‌మెంట్‌లో మూడు బెడ్‌రూమ్స్ ఫ్లాట్‌కు మెయింటెనెన్స్ చార్జీ నెలకు రూ.8,000, రెండు బెడ్‌రూమ్స్‌కు రూ.7,000 అనుకుందాం. అప్పుడు మూడు బెడ్‌రూమ్స్ ఫ్లాట్‌కు సంబంధించిన మెయింటెనెన్స్ చార్జీ మీద అంటే రూ.8,000 మీద మాత్రమే జీఎస్‌టీ కడితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. రూ.7,500 వరకు పన్ను మినహాయింపు ఉంది కాబట్టి అది పోనూ మిగతా మొత్తం మీద అంటే రూ.500 మీద జీఎస్‌టీ కడితే సరిపోతుందా అని. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం ఒక నెల మెయింటెనెన్స్ చార్జీ రూ.7,500 దాటినట్లయితే, మొత్తం చార్జీ మీద జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలో రూ.500 మీద కాకుండా మొత్తం రూ.8,000కు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే..: అలాగే ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే జీఎస్‌టీ కోసం మెయింటెనెన్స్ చార్జీని మొత్తంగా కలిపి చూడాలా లేదా విడివిడిగా చూడాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణలో ఒకే వ్యక్తికి ఒక మూడు బెడ్‌రూమ్స్ ఫ్లాట్, ఇంకా రెండు బెడ్‌రూమ్స్ ఫ్లాట్ ఉన్నాయనుకుందాం. రెండిం టి మీద కలిపి రూ.15,000 మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది. ఈ మొత్తం పన్ను మినహాయింపు పరిమితి రూ.7,500 మించి ఉంది కాబట్టి మొత్తం మీద జీఎ్‌సటీ కట్టాల్సి ఉంటుందా? దీనికి కూడా వివరణ ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి ఎన్ని ఫ్లాట్లు ఉన్నప్పటికీ ఏ ఫ్లాట్‌కు అయితే మెయింటెనెన్స్ రూ.7,500 దాటుతుందో దాని మీద మాత్రమే జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని అపార్ట్‌మెంట్లలో తక్కువ ఫ్లాట్లు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ రూ.7,500 దాటినప్పటికీ, వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటకపోవచ్చు. అలాంటప్పుడు అసోసియేషన్స్‌కు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
ఐటీసీ తీసుకోవచ్చా..: మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ తాము పొందిన వస్తు సేవల మీద జీఎస్‌టీ నిబంధనల మేరకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకోవచ్చా అంటే, కచ్చితంగా తీసుకోవచ్చు (ఐటీసీ నిబంధనల మేరకు మాత్రమే). మరి ఎలాంటి ఖర్చుల మీద తీసుకోవచ్చంటే.. సెక్యూరిటీ, లిఫ్ట్, కామన్ ఏరియా, మెయింటెనెన్స్, స్టేషనరీ, పంపులు, పైపులు, ఇతరత్రా అసోసియేషన్‌కు సంబంధించిన ఖర్చులు. అయితే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసులకు ఐటీసీ తీసుకోరాదు. ఇంకొక విషయం ఏమిటంటే అసోసియేషన్‌లో కొంతమంది రూ.7,500 పైన, మరికొందరు రూ.7,500 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లయితే పన్ను చెల్లించే టర్నోవర్ ప్రకారం క్రెడిట్ తీసుకోవాలి. ఉదాహరణకు ఒక నెలలో రూ.7,500 కంటే ఎక్కువ చెల్లించే మొత్తం రూ.15 లక్షలు, రూ.7,500 కంటే తక్కువ చెల్లించిన మొత్తం రూ.10 లక్షలు అనుకుంటే.. మొత్తం టర్నోవర్ రూ.25 లక్షల్లో 60 శాతం పన్ను చెల్లించే కేటగిరీ కింద