Share News

ఆంధ్రా షుగర్స్‌కు ప్రతిష్ఠాత్మక పేటెంట్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:31 AM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్‌ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సంస్థ రూపొందించిన ఫీడ్‌ జ్యూస్‌ క్లారిపికేషన్‌ కోసం...

ఆంధ్రా షుగర్స్‌కు ప్రతిష్ఠాత్మక పేటెంట్‌

తణుకు (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్‌ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సంస్థ రూపొందించిన ఫీడ్‌ జ్యూస్‌ క్లారిపికేషన్‌ కోసం పరికరం, ప్రక్రియ అనే వినూత్న ఆవిష్కరణకు గాను భారత ప్రభుత్వ పేటెంట్‌ కార్యాలయం ఈ నెల 10న పేటెంట్‌ మంజూరు చేసినట్లు సంస్థకు అధికారికంగా తెలియజేశారు. ఈ అత్యాధునిక సాంకేతిక రూపకల్పన, పరికర నిర్మాణం, ఆచరణాత్మక వినియోగం కోసం కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్‌కు చెందిన షుగర్‌ ప్లాంట్‌ ఎక్వి్‌పమెంట్‌ డెవల్‌పమెంట్‌ బృందం.. సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముళ్లపూడి నరేంద్రనాథ్‌ మార్గదర్శకత్వంలో కృషి చేసింది.

Updated Date - Aug 16 , 2026 | 05:31 AM