Share News

ఏఎంఐ పారాడిమ్‌ చేతికి ఎల్‌ అండ్‌ టీ ‘ఎస్‌డబ్ల్యూసీ’ వ్యాపారం

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:43 AM

ల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసె్‌సకు చెందిన స్మార్ట్‌ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎస్‌డబ్ల్యూసీ) వ్యాపారం చేతులు మారింది.

ఏఎంఐ పారాడిమ్‌ చేతికి ఎల్‌ అండ్‌ టీ ‘ఎస్‌డబ్ల్యూసీ’ వ్యాపారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసె్‌సకు చెందిన స్మార్ట్‌ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎస్‌డబ్ల్యూసీ) వ్యాపారం చేతులు మారింది. ఈ బిజినె్‌సను ఏఎం గ్రూప్‌ ప్రమోట్‌ చేసిన ఏఎంఐ పారాడిమ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎంఐపీఎస్‌) కొనుగోలు చేసింది. ఏఐ ఆధారిత పబ్లిక్‌ సిస్టమ్స్‌, కీలక మౌలిక సేవల్లో ఏఎంఐపీఎ్‌సకి మంచి పట్టుంది. తమ దీర్ఘకాలిక వృద్ధికి ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ కంపెనీ ఎస్‌డబ్ల్యుసీ వ్యాపారం మరింత దోహదం చేస్తుందని ఏఎంఐపీఎస్‌ తెలిపింది. అయితే ఎస్‌డబ్ల్యూసీ వ్యాపారాన్ని ఎంతకు కొనుగోలు చేసిందీ కంపెనీ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 27 , 2026 | 01:43 AM