Share News

మరో 120 నగరాలకు అమెజాన్‌ నౌ

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:47 AM

రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ అల్ట్రా-ఫాస్ట్‌ డెలివరీ సర్వీస్‌ ‘అమెజాన్‌ నౌ’ను మరింత విస్తరించింది

మరో 120 నగరాలకు అమెజాన్‌ నౌ
AMAZON

బెంగళూరు: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ అల్ట్రా-ఫాస్ట్‌ డెలివరీ సర్వీస్‌ ‘అమెజాన్‌ నౌ’ను మరింత విస్తరించింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సేవల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసి దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. విశాఖపట్నం సహా మంగళూరు, కొచ్చి, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, జలంధర్‌, అంబాలా, మణిపాల్‌ వంటి నగరాల్లో కొత్తగా ఈ సేవలను అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.

Updated Date - Oct 03 , 2026 | 01:47 AM