ఆల్కెమ్ నుంచి సెమాగ్లుటైడ్ సింగిల్ షాట్ సిరంజీలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:59 AM
ఆల్కెమ్ లేబొరేటరీస్ భారత మార్కెట్లోకి సెమాగ్లుటైడ్ ఔషధాన్ని సింగిల్ షాట్ ప్రీ-ఫిల్డ్ సిరంజీల రూపంలో విడుదల చేసింది....
ప్రారంభ ధర రూ.350
న్యూఢిల్లీ: ఆల్కెమ్ లేబొరేటరీస్ భారత మార్కెట్లోకి సెమాగ్లుటైడ్ ఔషధాన్ని సింగిల్ షాట్ ప్రీ-ఫిల్డ్ సిరంజీల రూపంలో విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.350గా ఉంది. మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడానికి వాడే ఈ ఔషధాన్ని ఈ రూపంలో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన మొదటి కంపెనీగా ఆల్కెమ్ నిలిచింది. రెడీ టూ యూజ్, సింగిల్ షాట్ ప్రీ-ఫిల్డ్ సిరంజీల ఫార్మాట్‌ను రోగులకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించినట్టు పేర్కొంది. సెమాగ్లుటైడ్ వయల్స్‌కు సంబంధించి కూడా రెగ్యులేటరీ అనుమతిని ఆల్కెమ్ పొందింది. త్వరలోనే ఇవి కూడా మార్కెట్లోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..