ఎయిర్‌టెల్ లాభంలో 33.5 శాతం క్షీణత
ABN , Publish Date - May 14 , 2026 | 01:40 AM
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 33.5 శాతం క్షీణించి...
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 33.5 శాతం క్షీణించి రూ.7,325 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.11,021.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వన్‌టైమ్ కేటాయింపుల కారణంగా లాభాలు తగ్గినట్టు పేర్కొంది. నాలుగో త్రైమాసికంలో ఆదాయం 15.6 శాతం వృద్ధితో రూ.47,876.2 కోట్ల నుంచి రూ.55,383.2 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ఎయిర్‌టెల్ ఒక్కో వినియోగదారు సగటు రాబడి రూ.257గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.245గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్