ఆర్థిక సేవలు, డేటా కేంద్రాలపై ఎయిర్‌టెల్ దృష్టి
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:21 AM
మలి దశ అభివృద్ధి కోసం భారతి ఎయిర్‌టెల్ కొత్తదారులు వెతుక్కుంటోంది. ఇందుకోసం ఆర్థిక సేవలు, డేటా కేంద్రాలు, క్లౌడ్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు కంపెనీ చైర్మన్ సునీల్...
మలి దశ అభివృద్ధికి సిద్ధం జూచైర్మన్ సునీల్ భారతి మిట్టల్
న్యూఢిల్లీ: మలి దశ అభివృద్ధి కోసం భారతి ఎయిర్‌టెల్ కొత్తదారులు వెతుక్కుంటోంది. ఇందుకోసం ఆర్థిక సేవలు, డేటా కేంద్రాలు, క్లౌడ్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కంపెనీ తాజా వార్షిక నివేదికలో తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ).. ఇప్పటికే తమ ఎయిర్‌టెల్ మనీ ని డిపాజిట్ల సేకరణకు అవకాశం లేని ఎన్‌బీఎ్‌ఫసీగా గుర్తించిన విషయాన్ని మిట్టల్ గుర్తు చేశారు. ఎయిర్‌టెల్ మనీని ఇందుకోసం ఇప్పటికే అవసరమైన నిధులతో పరిపుష్టి చేసినట్టు తెలిపారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ‘నెక్స్‌ట్రా’ పేరుతో 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా కేంద్రాలనూ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పెరుగుతున్న డిజిటైజేషన్, క్లౌడ్ అడాప్షన్ డేటా స్థానికీకరణతో ఈ రంగంలో మంచి అవకాశం ఏర్పడుతుందని మిట్టల్ పేర్కొన్నారు. క్లౌడ్ సేవలు కూడా తమ మలి దశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలిపారు. క్లౌడ్ సేవల కోసం ఇప్పటికే 24 కంపెనీలు తమతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మిట్టల్ వెల్లడించారు.
రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు
మన దేశంలో డేటా కేంద్రాల ఏర్పాటు కోసం అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు సైతం ముందుకు వస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఈ కేంద్రాల్లో పెట్టుబడులు రూ.18 లక్షల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు కూడా ఇందుకు కలిసి వస్తున్నాయి. గత పదేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కోసం భారతి ఎయిర్‌టెల్ ఒక్కటే రూ.3.3 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు మిట్టల్ వార్షిక నివేదికలో తెలిపారు. 5జీ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో డిజిటల్ సేవలు మరింత వేగంగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. టెలికాం రంగంలో తమ 5జీ సేవలు అందుకుంటున్న కస్టమర్ల సంఖ్య 18.8 కోట్లకు చేరినట్టు వెల్లడించారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్