భారత్‌లో ఎయిర్‌బస్ ఏటీఆర్ విమానాల తయారీ!
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:54 AM
భారత్‌లో తన ఏటీఆర్ రీజినల్ విమానాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు యూర్‌పకు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్ సంకేతాలిచ్చింది....
న్యూఢిల్లీ: భారత్‌లో తన ఏటీఆర్ రీజినల్ విమానాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు యూర్‌పకు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్ సంకేతాలిచ్చింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ భారత్‌లో ఇప్పటికే రెండు ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ల (ఎ్‌ఫఏఎల్)ను ఏర్పాటు చేసింది. 70 సీట్ల సామర్థ్యంతో కూడిన సీ295 మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్ కోసం వడోదరలో ఒక ప్లాంట్‌ను, హెచ్125 కమర్షియల్ హెలీకాప్టర్ల అసెంబ్లింగ్ కోసం కర్ణాటకలో మరో ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. అలాగే, ఉడాన్ పథకం కింద చిన్న నగరాల మధ్య విమానయాన సేవలందించే ఎయిర్‌లైన్స్ ఎక్కువగా ఎంచుకుంటున్న ఏటీఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత్‌లో ఎఫ్‌ఏఎల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..
మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..