ఎయిరిండియా గాడిన పడేందుకు పదేళ్లు పట్టొచ్చు..
ABN , Publish Date - Jul 29 , 2026 | 03:13 AM
ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు ఐదు నుంచి పదేళ్లు పట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. పాత విమానాల్లో కొత్త హంగులు ఏర్పాటు చేయడం, ఆర్డర్ పెట్టిన విమానాలు..
టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర శేఖరన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు ఐదు నుంచి పదేళ్లు పట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. పాత విమానాల్లో కొత్త హంగులు ఏర్పాటు చేయడం, ఆర్డర్ పెట్టిన విమానాలు సకాలంలో అందకపోవడం, పాత విమానాలకు స్పేర్ పార్ట్‌ల కొరత, విమాన ఇంధన ధరలు కొండెక్కడం ఎయిర్ ఇండియా ప్రస్తుత సమస్యలకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ఐదేళ్లలో పూర్తిగా పునర్ వ్యవస్థీకరించి లాభాలబాట పట్టించ వచ్చని టాటా సన్స్ మొదట్లో భావించింది. అయితే ఇదంత తేలికకాదని ఇప్పుడు తెలిసి వచ్చింది. టాటా గ్రూపు చేతుల్లోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలైనా ఎయిర్ ఇండియా ఇంకా భారీ నష్టాలతోనే నడుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.22,238 కోట్ల భారీ నష్టాలు చవి చూసింది.
చంద్ర పారితోషికం రూ.158.66 కోట్లు: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో రూ.158.66 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.2.85 కోట్లు ఎక్కువ. టాటా సన్స్ వార్షిక నివేదిక ఈ విషయం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..