ఈ ఏడాది మరో 7 విమానాల నవీకరణ
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:04 AM
ఎయిర్ ఇండియాకు గర్వకారణంగా నిలిచిన బోయింగ్ 787-8 విమానాల్లో మరో ఏడు విమానాలను ఈ ఏడాది కొత్త హంగులతో నవీకరించనున్నట్టు...
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు గర్వకారణంగా నిలిచిన బోయింగ్ 787-8 విమానాల్లో మరో ఏడు విమానాలను ఈ ఏడాది కొత్త హంగులతో నవీకరించనున్నట్టు (రెట్రోఫిటింగ్) సంస్థ ప్రకటించింది. సుదూర ప్రయాణాలకు ఈ విమానాలు ఎంతో కీలకమని తెలిపింది. ఈ విమానం గత సోమవారం ఢిల్లీలో ల్యాండ్ కాగా దాన్ని ఆదివారం సంస్థ ఆవిష్కరించింది. మొత్తం 250 సీట్లుండే ఈ రెట్రోఫిట్ విమానంలో బిజినెస్, ప్రీమియం ఎకానమీ,ఎకానమీ పేరిట మూడు శ్రేణులుంటాయి. తమ దగ్గర ఉన్న మొత్తం బోయింగ్ 787-8 విమానాలు ఎనిమిదింటినీ (ఆదివారం ఆవిష్కరించిన విమానం సహా) ఈ ఏడాది చివరిలోగా నవీకరించనున్నామని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ రాజేశ్ డోగ్రా చెప్పారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా చేతిలో మొత్తం 190 విమానాలున్నాయి. వాటిలో 33 బోయింగ్ 787 లేదా డ్రీమ్‌లైనర్లున్నాయి.