రెండేళ్లలో 100కు పైగా కొత్త విమానాలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:54 AM
మార్కెట్ పరిస్థితుల కారణంగా ఎయిరిండియా సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు....
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్
న్యూఢిల్లీ: మార్కెట్ పరిస్థితుల కారణంగా ఎయిరిండియా సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. అయినప్పటికీ లాభాలపై దృష్టిసారిస్తున్నామని, వచ్చే రెండేళ్ల కాలంలో 100కు పైగా కొత్త విమానాలను సమకూర్చుకోనున్నామని తెలిపారు. నష్టాలతో నెట్టుకువస్తున్న ఎయిరిండియాను త్వరలో వీడనున్న విల్సన్ స్థానంలో కొత్త సీఈఓ, ఎండీగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ చీఫ్ టెవోల్డే గెబ్రెమారియం బాధ్యతలు చేపట్టనున్నారు.