Share News

హైదరాబాద్‌-తిరుపతి మధ్య డెయిలీ విమాన సర్వీసులు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:53 AM

హైదరాబాద్‌, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్‌ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు...

హైదరాబాద్‌-తిరుపతి మధ్య డెయిలీ విమాన సర్వీసులు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్‌ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ గురువారం ప్రకటించింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం తిరుపతి నుంచి బయలుదేరి 4.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Updated Date - Aug 07 , 2026 | 04:53 AM