ఎయిర్ ఇండియా ఇంధన సర్‌చార్జీల పెంపు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:43 AM
విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ ఇండి యా, ఏఐ ఎక్స్‌ప్రెస్ తమ దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఇంధన సర్‌చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి
న్యూఢిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ ఇండి యా, ఏఐ ఎక్స్‌ప్రెస్ తమ దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఇంధన సర్‌చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దేశీయంగా రూ.400 నుంచి రూ.1,200 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో 55 డాలర్ల నుంచి 125 డాలర్ల వరకు పెంచుతున్నట్లు వెల్లడించాయి. కాగా ఆకాశ ఎయిర్.. ఇంధన సర్‌చార్జీలను దేశీయంగా రూ.375 నుంచి రూ. 1,150 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో రూ.2500 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి.