Share News

ఏఐతో ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలు

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:51 AM

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధితో భారత ఐటీ, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) కంపెనీల సంప్రదా య సేవలకు గిరాకీ తగ్గవచ్చని దేశీయ ఐటీ పరిశ్రమకు..

ఏఐతో ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలు

  • సంప్రదాయ సేవలకు తగ్గనున్న డిమాండ్‌: నాస్కామ్‌

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధితో భారత ఐటీ, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) కంపెనీల సంప్రదా య సేవలకు గిరాకీ తగ్గవచ్చని దేశీయ ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాస్కామ్‌ తాజా అధ్యయన నివేదిక పేర్కొంది. అయితే, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఖర్చులనూ తగ్గించడంతో పాటు చిన్న వ్యాపారాలకూ సాంకేతిక పరిష్కారాలను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా ఏఐ ఐటీ కంపెనీ వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించనుందని నాస్కామ్‌ అంటోంది. ఏఐ ఆధారిత యాంత్రీకరణ ఐటీ కంపెనీల ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చివేస్తోందని తెలిపింది.

Updated Date - Nov 29 , 2026 | 03:52 AM