Share News

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:03 AM

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌, ఐటీ, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్‌...

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌, ఐటీ, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) భాగస్వామ్యంతో ప్రోసస్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయం, తయారీ, హెల్త్‌కేర్‌, విద్య తదితర రంగాల్లో ఏఐ వినియోగం గణనీయంగా పెరగటమే కాకుండా ఉత్పాదకత కూడా పెరుగుతోందని తెలిపారు. ఏఐతో వస్తున్న అపార అవకాశాలను పలు రంగాలు అందిపుచ్చుకోవటమే కాకుం డా ఎంతో లబ్ధి పొందుతున్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు ఆరోగ్యం, విద్య, తయారీ రంగాల్లో ఏఐని వినియోగించటంతో పాటు సత్ఫలితాలను అందుకుంటున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనలు కనిపిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం అందుకు భిన్నంగా విస్తృత స్థాయిలో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ సామర్థ్యాలు, జీసీసీలు, స్టార్ట్‌ప్సతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు.. ఏఐలో పలు అవకాశాలను దక్కించుకుంటున్నాయని ప్రోసస్‌, నాస్పర్స్‌ గ్రూప్‌ ఎండీ సెహ్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 03:04 AM